దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడినట్లు యూఎఫ్బీయూ యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిగిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు, వినియోగదారులకు పెద్ద ఊరట లభించిందని, దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఎప్పుడూ లాగే యథావిధిగా పనిచేయనున్నాయని యూనియన్ స్పష్టం చేసింది.