వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తికి కేంద్రం గోబర్ధన్ పథకం
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
దేశంలో వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.23,731 కోట్ల వ్యయంతో గోబర్ధన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిదారులకు మార్కెట్ భరోసా కల్పించడం, దీర్ఘకాలిక ఆదాయ స్థిరత్వాన్ని పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026-27 నుంచి 2035-36 వరకు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా అర్హత గల ప్రాజెక్టులకు మూలధన సాయం అందించనున్నారు.