రష్యా సైన్యంలోకి ఉత్తరప్రదేశ్ విద్యార్థులు, ఆందోళనలో కుటుంబాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు చదువు కోసం రష్యా వెళ్లగా, అక్కడి అధికారులు వారి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకుని బలవంతంగా సైన్యంలో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వారితో సంబంధాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించి మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.