పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్ల ఫోన్లు సీజ్!

రిపోర్టర్: నరేష్ స్థలం: World

ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్ ముగిసే వరకు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ అవుతోందన్న అనుమానాలతోనే పీసీబీ ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, బోర్డు మాత్రం అధికారిక కారణాలు వెల్లడించలేదు. ఈ విచిత్ర నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.