డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై సత్య మాస్టర్ ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న అంతర్గత విభేదాలపై సీనియర్ మాస్టర్ సత్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అనుసరిస్తున్న విధానాల వల్ల సంఘం నిర్వీర్యం అవుతోందని ఆయన ఆరోపించారు. విభజించి పాలించు సిద్ధాంతంతోనే సమస్యలు తలెత్తాయని, సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది డాన్సర్లు భయంతో బయటకు రాలేకపోతున్నారని, తాము వారి తరఫున నిలబడి పోరాడుతామని సత్య మాస్టర్ తేల్చిచెప్పారు.