ఫ్యాక్షన్ నీడలను దాటి నీట్‌లో సత్తా చాటిన కర్నూలు యువకుడు ప్రవీణ్

రిపోర్టర్: సతీష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లాలోని కుప్పట్రాళ్ల గ్రామానికి చెందిన యువకుడు ప్రవీణ్ కుమార్ నీట్ ఫలితాల్లో 508 మార్కులు సాధించి చరిత్ర సృష్టించాడు. కడప రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుని ఆ ఘనత సాధించిన తొలి గ్రామస్థుడిగా నిలిచాడు. నాటి ఎస్పీ రవికృష్ణ స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, డాక్టర్‌గా సొంత ప్రాంత ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేశారు.