అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు తండ్రి పేరునే వాడిన జగన్

రిపోర్టర్: హరి స్థలం: కృష్ణా

అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు తండ్రి అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించడంతో పాటు అందులో తండ్రి పేరును కూడా చేర్చిన నీచుడు జగన్ రెడ్డి అంటూ కొల్లు రవీంద్ర - గనుల & ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి శవం పక్కన కూర్చుని సంతకాలు సేకరించిన నిన్ను మించిన దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు గుప్పించారు.