సర్పంచ్ చెక్ పవర్‌పై హైకోర్టు మధ్యంతర స్టే
రిపోర్టర్: సునీల్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా గుంజోటి సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ చెక్ పవర్‌ను నిలిపివేస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. అక్టోబర్ 6 వరకు గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ప్రత్యర్థుల తప్పుడు ఫిర్యాదులతోనే ఈ చర్యలు తీసుకున్నారని, చివరకు ధర్మమే గెలిచిందని సర్పంచ్ అన్నారు.