ఓటీటీ విడుదలకి సిద్ధమైన బిజు మీనన్ కుటుంబ కథా చిత్రం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
మలయాళ నటుడు బిజు మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం 'అవరాచన్ అండ్ సన్స్' త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాలు వెల్లడించాయి. అమల్ షీలా తంబి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.