తీహార్ జైలులో శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి ప్రాణభయం
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు తోటి ఖైదీల నుంచి ముఖం కోసేస్తామంటూ తీవ్ర బెదిరింపులు ఎదురవుతున్నాయని, అతని భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. గత పది రోజులుగా కొందరు ఖైదీలు తనను శారీరకంగా హాని చేస్తామని హెచ్చరిస్తున్నారని నిందితుడు కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో, విచారణ ఖైదీల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.