సిరిసిల్ల అభివృద్ధిలో పది శాతం కూడా కొడంగల్లో చేయాలంటూ రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్
రిపోర్టర్: సురేష్
స్థలం: కరీంనగర్
సిరిసిల్లలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం పది శాతమైనా కొడంగల్లో చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. కేవలం మాటలే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.