ఆరిమాని గంగమ్మ దసరా ఉత్సవాలు: సీఐ హనుమంతప్పను ఆహ్వానించిన పాలకమండలి
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవానికి సీఐ హనుమంతప్పను ఆలయ పాలకమండలి ఘనంగా ఆహ్వానించింది. ఈ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని ఆయన తెలిపారు. వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటరాయల్, చైర్మన్ జలంధర్ నాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.