నెల్లూరు పొట్టేపాలెం కలుజుపై నూతన వంతెన అక్టోబరు రెండున ప్రారంభం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజుపై వంతెన లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం స్పందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయగా, నూతన వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వంతెనను అక్టోబరు రెండవ తేదీన ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే వర్షాకాలంలో రాకపోకలకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులు తొలగిపోనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.