రూ.640 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ మెగా ప్రాజెక్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.640 కోట్ల భారీ అంచనా వ్యయంతో హిరమండలం రిజర్వాయర్ నుంచి 365 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించేలా మెగా ప్రాజెక్టును రూపొందించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామీ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించడమే ఈ మహా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.