వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల పోలీసుల కేసు నమోదు
రిపోర్టర్: నరేష్
స్థలం: Kadapa
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు ఆర్వో కార్యాలయం వద్ద వైసీపీ నేతలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏజెంట్లను అడ్డుకున్నారంటూ నిరసన చేపట్టిన నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.