చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
రాబోయే ఉత్సవాలు, పండగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి మరియు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య మొత్తం 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ప్రతి వారం మంగళ, బుధవారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం మీదుగా నడిచే ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.