సముద్రంలో తీవ్ర అలజడి: కృష్ణా జిల్లాలో ముందుకు చొచ్చుకొచ్చిన కెరటాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కృష్ణా జిల్లా
అర్నబ్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చిందని, ఆరు నుంచి ఏడు మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. తుపాను ప్రభావం కారణంగా కోడూరు మండలంలో భారీ వర్షాలు కురిశాయని, తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు వెల్లడించారు.