నార్సింగి రోడ్డు బాధితులకు హరీశ్ రావు భరోసా: కాంగ్రెస్ తీరుపై నిప్పులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రంగారెడ్డి

నార్సింగిలో మాస్టర్ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పు పేరుతో ఇండ్లు కూల్చాలని చూస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. సెవెన్హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీల్ లో ఆయన బాధితులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రభుత్వమే అనుమతిచ్చి ఇప్పుడు బుల్డోజర్లు దింపడం దుర్మార్గమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ రోడ్డు రద్దయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.