విజయనగరం జిల్లాలో దారుణం: పసికందును అమ్మకానికి పెట్టారంటూ తండ్రి సంచలన ఫిర్యాదు

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా అయ్యన్నపేటలో భార్యాభర్తల వివాదం కారణంగా పుట్టిన నెల రోజుల పసికందును రహస్యంగా ఉంచిన వైనం కలకలం రేపింది. బాబు చనిపోయాడని అత్తింటివారు అబద్ధం చెప్పారని, విక్రయించారంటూ తండ్రి పట్టా మూర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విచారణ జరిపి బాలుడిని శిశుగృహంలో చేర్పించినట్లు వెల్లడించారు.