కవ్వాల్ గ్రామంలో కాంగ్రెస్ నూతన కమిటీ ఏకగ్రీవంగా కొలువుదీరింది
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు నందు నాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా సత్తయ్యను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, చంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.