పలాస ఎన్నికల బరిలో ఇంటింటి ప్రచారంతో హోరెత్తించిన శ్రీను పండా
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పదిహేడో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీను పండా హోరాహోరీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలిసి మాట్లాడారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.