చెరువుల రక్షణే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా ముందడుగు

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

వేగవంతమైన పట్టణీకరణ, చెరువుల కబ్జాల కారణంగా నగరాలకు వరద ముప్పు పొంచివుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. నాగోలులో యువ ఆపద మిత్ర ఐదో బ్యాచ్ శిక్షణను ఆయన ప్రారంభించారు. చెరువులు, నాలాల అభివృద్ధి ద్వారానే వరదలను కట్టడి చేయవచ్చని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలు భూకంపాలతో సమానమైన ముప్పని, విపత్తుల వేళ ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో ఆపద మిత్రులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.