విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గంటా
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మీ ఇల్లు మీ హక్కు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గంలో మొత్తం ఐదు వేల తొంభై ఏడు మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయెన్స్ డీడ్లను అందజేసినట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సొంతింటి కల సాకారమవుతున్న లబ్ధిదారుల ఆనందంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.