బాలిక కిడ్నాప్‌పై హైకోర్టు ఆగ్రహం, డీజీపీకి అఫిడవిట్ ఆదేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

అమరావతిలో పదో తరగతి బాలిక అపహరణ కేసులో హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలుగా ఆచూకీ కనుగొనడంలో విఫలమవడంపై డీజీపీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాలిక తండ్రితో ఇంటికి వెళ్తానని చెప్పడంతో ఆమెను ఆయనకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి సహకరించిన వారిపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.