భాజపాలోకి ఎన్సీపీఐ ఎంపీల చేరికపై బెంగాల్‌లో తీవ్ర దుమారం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. టీఎంసీని వీడి ఎన్సీపీఐలో చేరిన 17 మంది ఎంపీలు భాజపాలో చేరనున్నట్లు రెబల్‌ ఎంపీ జగదీశ్‌ చంద్ర బర్మా బసునియా సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను తోటి రెబల్‌ ఎంపీలు, భాజపా రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించాయి. ద్రోహులు, రాజకీయ అవకాశవాదులంటూ టీఎంసీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.