విద్యార్థులకు అలర్ట్: ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

పది, పన్నెండో తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నట్లు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. ఈ రెండు తరగతులకు సంబంధించి సుమారు నలభై ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ డేట్షీట్ పీడీఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.