రిమ్స్ బాధితులను పరామర్శించనున్న కవిత తక్షణ సాయం ప్రకటన

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పరామర్శించనున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ పర్యటనలో ఆమె బాధితులకు ధైర్యం చెప్పనున్నారు.