ఆలేరులో విద్యార్థి-యువజన ర్యాలీ.. కేటీఆర్ పిలుపు మేరకు కార్యాచరణ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబర్ 5న ఆలేరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు ప్రతికంఠం శంతన్ రాజు తెలిపారు. ఆలేరు పాల సెంటర్ నుండి బస్టాండ్ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించిన ఆయన, ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.