మధ్యప్రదేశ్ లో ప్రాథమిక విద్యలో సున్నా శాతం డ్రాపౌట్ సాధన

రిపోర్టర్: రాము స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లో ప్రాథమిక విద్యలో సున్నా శాతం డ్రాపౌట్ లక్ష్యాన్ని సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నాయకత్వంలో ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని మంత్రి చైతన్య కశ్యప్ తెలిపారు. 2002-03 విద్యా సంవత్సరంలో 15 శాతంగా ఉన్న డ్రాపౌట్ రేటు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వం పేర్కొంది.