రామభద్రపురం వైద్య శిబిరం: ఆరికతోటలో ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: రామభద్రపురం
రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ, మదర్ తెరిసా సేవా సంస్థ మరియు మిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పది మంది వైద్యుల బృందం పాల్గొని సుమారు ఎనభై ఆరుగురు రోగులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.