రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్న యష్ కీలక నిర్ణయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక 'రామాయణ' చిత్రంలో రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్ భారీ పారితోషికం తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ వేశారు. రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ బదులుగా ఈ సినిమా దక్షిణాది థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న యష్, ఈ భారీ పౌరాణిక చిత్రం ద్వారా సౌత్ మార్కెట్ పై గట్టి పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు.