వైజాగ్ నగరంలో నిరాశ్రయుల ఆకార్తి తీర్చేలా కమ్యూనిటీ ఫ్రిజ్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిజ్ల ద్వారా నిరాశ్రయులకు నిత్యం ఆహారం అందుతోందని విశాఖపట్నం నగర పోలీస్ శాఖ వెల్లడించింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ తలపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలు సమాజంలోని పేదలకు, నిరాశ్రయులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయని, దాతలు ముందుకు వచ్చి ఆహారాన్ని అందించాలని అధికారులు కోరారు.