రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: పకడ్బందీగా భారీ భద్రతా ఏర్పాట్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా ప్రారంభమైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు సాగే ఈ పోలింగ్ కోసం అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు కార్పొరేషన్లు, ఎనభై ఏడు మున్సిపాలిటీల్ లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారని, సమస్యాత్మక ప్రాంతాల్ లో పోలీసులు భారీగా మోహరించారని అధికారులు వెల్లడించారు.