భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం కీలక సవరణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి పునరావాస చట్టానికి ప్రభుత్వం సవరణ చేసింది. సేకరించిన భూమి పట్టణ సరిహద్దు నుంచి ఉన్న దూరం ఆధారంగా మల్టిప్లికేషన్‌ ఫ్యాక్టర్‌ను 1.05 నుంచి 1.50 వరకు నిర్ణయించింది. గిరిజన ప్రాంతాల్లో 1.50 చొప్పున రిజిస్ట్రేషన్‌ విలువను హెచ్చించి నష్టపరిహారం చెల్లించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.