రాష్ట్రంలో ఏడాదిలోగా ప్రతి భూమి సర్వే: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: ఖమ్మం

రాష్ట్రంలో ఏడాదిన్నరలోగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే వెల్లడించారు. దశలవారీగా భూ సర్వే నిర్వహించి, ప్రతి భూ కమతానికి ల్యాండ్ పార్సెల్ మేపింగ్ నంబర్ కేటాయిస్తామని పేర్కొన్నారు. మనిషికి ఆధార్ లాగా ప్రతి భూమికి క్యూఆర్ కోడ్, మ్యాప్ తో కూడిన ప్రత్యేక భూదార్ పాసుబుక్కులను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.