స్టాక్ మార్కెట్ అప్డేట్స్: లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీల ట్రేడింగ్

రిపోర్టర్: మహేష్ స్థలం: ముంబై

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 23,850 మార్క్ను తాకింది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఫార్మా, రసాయన రంగాల షేర్ల కొనుగోళ్లతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం వ్యక్తమైంది. పలు ప్రధాన కంపెనీలు లాభాల బాటలో పయనించగా, మరికొన్ని సంస్థలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.