వైద్య కోర్సుల ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ వైద్య కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఒరిజినల్ ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు వెల్లడించారు.