నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు తెలుగు యువకుడు ఎంపిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పశ్చిమగోదావరి
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరు గ్రామానికి చెందిన తెలుగు యువకుడు జశ్వంత్ శ్రీ శిస్టా నాసా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ 2027 కు ఎంపికయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. భారతదేశం తరఫున ఈ శిక్షణకు ఎంపికైన ఐదో కుర్రాడిగా ఆయన రికార్డు సృష్టించారని, అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక శిక్షణా కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 14 మందిలో తాను ఒక్కడినే భారతీయుడినని ఆయన పేర్కొన్నారు.