సంగం జాతీయ రహదారిపై లారీ ఢీకొని బైకర్ అక్కడికక్కడే బలి

రిపోర్టర్: saikumar స్థలం: సంగం

సంగం జాతీయ రహదారిపై కొండ కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న కాకర్ల చెన్నకేశవరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బైకును వేగంగా ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యా నాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.