వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు మరియు సబ్‌సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, మందుల కొరత లేకుండా ముందస్తు ఇండెంట్లు సమర్పించాలని సూచించారు. సబ్‌సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.