పోషకాహార ప్రాధాన్యతను చాటేలా పోషణ్ మహా పోస్టర్ ఆవిష్కరణ
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో పోషణ మాసం–2026లో భాగంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత కార్యాలయ సముదాయంలో పోషణ్ మహా పోస్టర్ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.