ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో కాల్పుల బాధితుడు మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: Pennsylvania

అమెరికాలో గతంలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో కాల్పులకు గురై తీవ్రంగా గాయపడిన జేమ్స్ కోపెన్హావర్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో 2024 జూలై 13వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 76 ఏళ్ల కోపెన్హావర్ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు అల్లెగెనీ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం వెల్లడించింది. ఈ మృతిపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.