కోట్లాది రేషన్ కార్డుల నిలిపివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని సుమారు కోటి ఎనభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల కార్డులను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే కార్డులు నిలిచిపోయిన వారు మూడు నెలల్లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకుని తమ అర్హతను నిరూపించుకుంటే తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.