చెజ్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో చైనా దూకుడు

రిపోర్టర్: నరేష్ స్థలం: సమర్‌ఖండ్

ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో చైనా జట్టు అగ్రస్థానంలో దూసుకుపోతున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ టాప్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా చైనా క్రీడాకారిణులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మొదటి బోర్డులో ఆడుతున్న జు జినెర్ అజేయ ప్రదర్శనతో జట్టును విజయాల పథంలో నడిపిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.