పిల్లల్లో మాదకద్రవ్యాల వ్యసనంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

దేశంలోని పిల్లల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా చూడకుండా బాలల రక్షణ అంశంగా గుర్తించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని బీహార్ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదుగురు యుక్త వయస్కుల్లో ఒకరు డ్రగ్స్ వ్యసన ప్రమాదంలో ఉన్నట్లు తెలిపారు. వ్యసనం బారిన పడిన పిల్లల విషయంలో సమాజం అత్యంత సున్నితమైన వైఖరిని ప్రదర్శించాలని ఆయన హితవు పలికారు.