బెంగళూరు వేదికగా పనామాతో ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న భారత ఫుట్‌బాల్ జట్టు
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
ఆసియా క్రీడలకు అనుమతి లభించని తరుణంలో భారత ఫుట్‌బాల్ జట్టు పనామాతో కీలక అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో బ్లూ టైగర్స్ తలపడనున్నాయి. ఉరుగ్వే, బ్రెజిల్ వంటి ప్రపంచ కప్ జట్లతో తలపడేందుకు ఈ మ్యాచ్ సన్నాహకంగా నిలుస్తుందని కోచ్ ఖాలిద్ జమీల్ తెలిపారు. ఆటగాళ్లను ముందుగా విడుదల చేసిన క్లబ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.