పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో దారుణ దాడి: బెంగళూరుకు బాధితురాలు తరలింపు
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది రంపంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.