ఓటీటీలోకి మెగాస్టార్: నెట్ఫ్లిక్స్ వేదికగా మెగావర్స్ టాక్ షోతో చిరంజీవి సందడి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారని నెట్ఫ్లిక్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ ఓటీటీ వేదికపై మెగావర్స్ పేరుతో ఆయన ఒక సరికొత్త టాక్ షోకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ లోని కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షోలో టాలీవుడ్ ప్రముఖ నటులతో పాటు పలువురు సినీ దిగ్గజాలు గెస్టులుగా హాజరై సందడి చేయనున్నట్లు సమాచారం.