కొయ్యూరు మండలంలో బూదరాళ్ల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నారాయణ ఖరారు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా వంతల నారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారైంది. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.