కుత్బుల్లాపూర్: క్యాన్సర్ బాధితుడికి పది లక్షల విలువైన ఎల్వోసీ మంజూరు

రిపోర్టర్: రమేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి మూడు విడతల్లో పది లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ పత్రాలు మంజూరయ్యాయని కె.పి. వివేకానంద - ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ వెల్లడించారు. ఈ సహాయాన్ని మాజీ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా బాధితుడికి అందించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్ష కోసం నిరంతరం అండగా నిలుస్తామని, నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.